N కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున

-

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) స్పందించారు. స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

“స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను.

ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది.

స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది.

ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.

తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.

అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. -అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)” అని ట్వీట్ చేశారు.

కాగా, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేసిన కట్టడాలపై హైడ్రా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణం అని రుజువైతే బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. ఈ క్రమంలో అక్కినేని నాగార్జునకి చెందిన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ ను శనివారం ఉదయం కూల్చివేసింది. తుమ్మిడి చెరువులోని మూడున్నర ఎకరాల భూమిని ఆక్రమించి కన్వెన్షన్ హాల్ నిర్మించారన్న అభియోగాల నేపథ్యంలో హైడ్రా యాక్షన్ తీసుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్యన కూల్చివేతలను చేపట్టింది.

Read Also: నాగార్జునకి భారీ షాక్.. N కన్వెన్షన్ కూల్చివేత
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...