ప్రొఫెసర్ కోదండరామ్, ఆకునూరి మురళి అరెస్ట్

-

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం(Kodandaram), మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి(Akunuri Murali) డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య కేంద్రంలో అకాల వర్షాల కారణంగా పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం కొత్త సచివాలయానికి వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రం అందజేయాలని భావించిన కోదండరాం, ఆకునూరి మురళి(Akunuri Murali)ని మార్గం మధ్యంలో అరెస్ట్ చేసి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలతో తీవ్ర పంటనష్టం జరిగిందని, కానీ ప్రభుత్వం మాత్రం పరిహారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుల కోసం పంటల బీమా పథకం(Crop Insurance Scheme) ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి, తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
Read Also: వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సుకు రండి.. చైనా నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...