Akunuri Murali | కేటీఆర్.. మీ ఒక్క అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా?

-

మీ ఒక్క అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా? అని మాజీ రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి(Akunuri Murali) మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. ‘ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి నియోజకవర్గం కోనాపూర్‌ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేశాం. త్వరలో ప్రారంభోత్సవం చేయనున్నాము’ అని మంత్రి కేటీఆర్(Minister KTR) ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘మా గ్రాండ్ మదర్ (నానమ్మ) వెంకటమ్మ తప్పకుండా సంతోషిస్తారు.’ అంటూ మంత్రి ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీనిపై ఆకునూరి మురళి(Akunuri Murali) స్పందిస్తూ ఆదివారం ట్వీట్ చేశారు. మీ ఒక్క అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా? మిగతా 26 వేల అమ్మమ్మల సంగతేంటి ముఖ్యమైన మంత్రి అంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్ల తర్వాత మన ఊరు మనబడి అంటివి.. 7268 కోట్లు అంటివి.. ఇప్పటివరకు 430 కోట్లే (6%) మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. 26 వేల ప్రభుత్వ బడుల్లో కూడా ఇలాంటి భవనాలు కడితే మెచ్చుకుంటామని ట్వీట్ చేశారు.

- Advertisement -
Read Also: ఫలక్ నుమా రైలు ప్రమాద ఘటనతో రైల్వేకి ఎంత నష్టం?

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...