ఎన్నికల తుది ప్రచారం వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం(MLA Abraham) పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అబ్రహంకే చోటు కల్పించారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్సీ చల్లా వెంట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఉన్న ఆయన హస్తం కండువా కప్పుకున్నారు.
కాగా 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలంపూర్ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ చేతిలో ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన అబ్రహం(MLA Abraham ) 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.