తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల(Group 2 Exam) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) వెల్లడించారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. ఒక్కో పరీక్ష 150 మార్కులకు జరుగుతుందని, మొత్తం పరీక్షలు కలుపుకుని 600 మార్చులకు జరుగుతాయని వివరించారు. 783 గ్రూప్-2 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేయగా వీటికి మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
‘‘గ్రూప్-2 పరీక్షలు ఇప్పటి వరకు ఎగ్జామ్ 4 సార్లు పోస్ట్పోన్ అయింది. 1,368 కేంద్రాలులో పరీక్ష నిర్వహణ జరుగుతుంది. 49,843 మంది సిబ్బంది పరీక్షకు అందుబాటులో ఉంటారు. ఇప్పటి వరకు 77% హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 80 శాతం పైగా డౌన్లోడ్ చేసుకుంటారు అని అంచనా వేస్తున్నాం. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దు…. ఎలాంటి అపోహలు వద్దు. చైర్మన్‌గా నాకు ఉన్న అధికారాలు అన్ని మీకోసం ఉపయోగిస్తాను.
Group 2 Exam | బయో మెట్రిక్ కచ్చితంగా ఇవ్వాలి లేకుంటే జవాబు పత్రం తిరస్కరించపడుతుంది. గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు పూర్తి అవడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చాలా తొందరగా ఫలితాలు విడుదల చేస్తాము. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. క్వశ్చన్ పేపర్ అభ్యర్థులకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగత్రలు తీసుకున్నాము’’ అని తెలిపారు.