బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) తీవ్రంగా హెచ్చరించారు. బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని.. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తే సహకరిస్తామని లేదంటే తాము ఏంటో చూపిస్తామన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఐదుగురు మంత్రులు బీజేపీ(BJP) అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని.. ఏక్‌నాథ్ షిండే లాగా అవ్వడానికి కొంతమంది రెడీగా ఉన్నారని జోస్యం చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందని.. ఆర్-ట్యాక్స్ కింద వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయం రేవంత్ రెడ్డికి ఉందని ఆయన(Maheshwar Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. కాగా తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడతాం అంటే ప్రజలు ఊరుకుంటారా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇదేమైనా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనుకుంటున్నారా? అవసరమైతే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని వ్యాఖ్యానించారు.