టాలీవుడ్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఆ ఆయనతో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పూచీకత్తు సమర్పించేందుకు అల్లు అర్జున్ కోర్టుకు వెళ్లారు. అందులో భాగంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై ఆయన సంతకం చేయనున్నారు.
ఇప్పటికే రూ.50 వేల పూచీకత్తుకి సంబంధించిన రెండు షూరిటీ బాండ్స్ పైన అల్లు అర్జున్ సంతకం చేశారు. ఇక బెయిల్ పొందిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఆయన పర్సనల్ బాండ్ పైన కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది.
కోర్టు(Nampally Court)లో ఫార్మాలిటీస్ అనంతరం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకోనున్నారు. కాగా, ఆయన కోర్టుకి వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ ఎంట్రీతో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి, రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్లు అర్జున్(Allu Arjun) ని ఏ11 గా చేర్చారు. ఈ కేసు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.