ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు రావడానికి ఇద్దరే కారణమని, అది మహాత్మా గాంధీ(Mahatma Gandhi), డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్(Ambedkar)లే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో కాంగ్రెస్ దళితులకు ఎన్నో అవకాశాలు కల్పించిందని అన్నారు. రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ అవకాశం కల్పించిందని తెలిపారు. భవిష్యత్లో కూడా అంబేద్కర్ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించి అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళతామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు.
Read Also: ఫస్ట్ మ్యాచ్లోనే రికార్డు సృష్టించిన అర్జున్ టెండుల్కర్
Follow us on: Google News, Koo, Twitter