బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఏడాదికి 4 ఉచిత సిలిండర్లు.. 

-

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో ఈ మేనిఫెస్టోను ప్రకటించారు. ఇందులో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా హామీలు ఇచ్చారు.

- Advertisement -
మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇవే..

బీసీ వ్యక్తిని తెలంగాణ తొలి సీఎంగా చేయడం

‘ధరణి’కి బదులు ‘మీ భూమి’ యాప్

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1న వేతనాలు, పింఛన్లు

గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ ఏజెన్సీ,

మత రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంపు

ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు

డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థినులకు ఉచిత ల్యాప్ టాప్స్

ఉజ్జ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు

మహిళా రైతుల కోసం మహిళా కార్పొరేషన్ ఏర్పాటు

రైతులకు ఎరువుల సబ్సిడీతో (ఎకరాకు రూ.18 వేలు) పాటు రూ.2,500 ఇన్ పుట్ అసిస్టెన్స్

పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఉచిత పంట బీమా

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏడాదికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు

జిల్లా స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రోత్సాహం.

పోలీసులు, హోంగార్డులు, కాలేజీ విద్యార్థులు, ఇతర వాలంటీర్లకు సీపీఆర్ శిక్షణ

మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల విధానంపై పర్యవేక్షణ

ఆడబిడ్డ భరోసా కింద నవజాత బాలిక పేరు మీద రూ.2లక్షలు ఫిక్స్డ్‌ డిపాజిట్

సింగరేణి ఉద్యోగులకు ఆదాయ పన్ను రీయింబర్స్ మెంట్, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.

హైదరాబాద్ – విజయవాడ పారిశ్రామిక కారిడార్ ప్రారంభానికి చొరవ

కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి సమీక్ష

రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టేలా చర్యలు

కొత్త రేషన్ కార్డుల మంజూరు.

నిజామాబాద్ ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు

మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు, స్వయం సహాయక బృందాలకు నామమాత్రపు 1 శాతం వడ్డీకే రుణాలు

UPSC తరహాలోనే 6 నెలలకోసారి TSPSC ద్వారా ఉద్యోగాల భర్తీ

గ్రూప్ – 1, 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ, EWS కోటా, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తామని హామీ.

వయో వృద్ధులకు ఉచితంగా కాశీ, అయోధ్య యాత్ర

జాతీయ స్థాయిలో మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర నిర్వహణ.

సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ఆగస్ట్ 27న ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం’ నిర్వహణ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...