కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పర్యటన తెలంగాణ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం ఈ అర్దరాత్రి అమిత్ షా హైదారాబాద్ రావాల్సి ఉంది. రేపు (గురువారం) నగరంలో నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొని ఖమ్మంలో జరిగే పార్టీ సభకు హాజరు కావాల్సి ఉంది. ఖమ్మం(Khammam) సభను బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే, చివరి నిమిషయంలో అనూహ్యంగా షా పర్యటన రద్దు అయింది. బిపర్జాయ్ తుఫాను తీరం దాటనుండటంతో హోం శాఖ మంత్రిగా తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షించాల్సి ఉన్న కారణంగా పర్యటన రద్దు అయింది. దీంతో బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లను నిలిపివేశారు. షా(Amit Shah) పర్యటన రద్దు కావడంతో పార్టీ శ్రేణులు కాస్త నిరాశకు గురయ్యారు.