కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)పై కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అంబేద్కర్ రాజ్యంగం నడుస్తుందా..? బీజేపీ రాజ్యంగం నడుస్తుందా..? అని ప్రశ్నించారు. హోంమంత్రిగా అమిత్ షా అన్ ఫిట్.. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామనడం బీజేపీ ఆహంకానికి నిదర్శనమని మండిపడ్డారు. మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పడంతో పాటు పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా సూచించిందని గుర్తుచేశారు. మా ప్రభుత్వం వెనకబడిన ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు.
పేద ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లు తొలగిస్తామంటే ఎలా..? ఆగ్రహం వ్యక్తం చేశారు. మత పరంగా ముస్లింలను శత్రువులుగా చూస్తే ఎలా అని అడిగారు. హోంమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా ఎలా మాట్లాడుతారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదని ఫైర్ అయ్యారు. అమిత్ షా పై రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వర్గానికి అమిత్ షా హోంమంత్రి కాదు.. ఈ దేశానికి అన్న విషయం మర్చిపోయారా? అని షబ్బీర్ అలీ(Shabbir Ali) ఎద్దేవా చేశారు.
Read Also: ప్రధాని, అదానీల బంధంపై మంత్రి కేటీఆర్ విమర్శలు
Follow us on: Google News, Koo, Twitter