Amit Shah | తెలంగాణకు అమిత్ షా.. రెండు కీలక అంశాలపై ఫోకస్

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఈనెల 28న తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో రెండు అంశాలపై బీజేపీ ఫోకస్ పెట్టనుంది. శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడంతోపాటు, పది పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. బీజేపీ నేతలు అమిత్ షా అధ్యక్షతన పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారి అమిత్ షా తెలంగాణ(Telangana) పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న బీజేపీ(BJP) సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతల నుండి మండల స్థాయి అధ్యక్షుల వరకు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అమిత్ షా అధ్యక్షతన జరగనుంది. అమిత్ షా సమక్షంలో పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలపై రాష్ట్ర నాయకత్వం అసంతృప్తిగా ఉన్నప్పటికీ కేంద్ర నాయకత్వం మాత్రం సంతృప్తికరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. 8 ఎమ్మెల్యే సీట్లు 14% ఓటింగ్ రావడం పై హర్షం వ్యక్తం చేశారు పార్టీ పెద్దలు.

ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలపై కూడా బీజేపీ హై కమాండ్ మరిన్ని ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. దీంతో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ నెల 28 న జరిగే సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై అమిత్ షా(Amit Shah) నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్(BJP) ఒకటే అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) చేసిన ప్రచారంతో నష్టం వాటిల్లిందని గ్రహించిన అధిష్టానం.. ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు సూచనలు చేయనున్నారు. పార్లమెంటు సెగ్మెంట్ బరిలో ఎవరిని దింపాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also: YCP కి భారీ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...