Minister Harish Rao: వైద్యశాఖలో మరో కీలక స్టెప్..PHC Hub ప్రారంభించిన మంత్రి హరీష్

-

Another important step in the medical sector Minister Harish Rao started the PHC hub: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మెరుగైన మార్పులు తీసుకురాబోతున్నట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో పీ హెచ్ సి హబ్ (PHC hub) ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పీహెచ్సి హబ్ ల ద్వారా తెలంగాణ వైద్యశాఖ మెరుగైన సేవలను తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. పీహెచ్సి ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నూతనంగా ప్రారంభించిన ఈ మానిటరింగ్ హబ్ సేఫ్టీ, సెక్యూరిటీ కోసం కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ నుంచి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఉన్న పిహెచ్సి వైద్యులు, రోగులతో హరీష్ రావు (Minister Harish Rao) వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.

- Advertisement -

మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే…

వైద్యులు, వైద్య సిబ్బంది శిక్షణా కార్యక్రమాలకు పిహెచ్చి హబ్ ఎంతో ఉపయోగపడుతుంది.

రాష్ట్రంలోని 887 పీహెచ్సి ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. వాటి ద్వారా వీడియో కాల్స్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

స్పెషలిస్ట్ సర్వీసులు కూడా దీని ద్వారా పొందవచ్చు.

టీఎస్ఎమ్ఐడీసీ (Tsmidc) కు కూడా సీసీ కెమెరాలను అనుసంధానం చేశాం.

సేఫ్టీ, సెక్యూరిటీ కోసం పిహెచ్సి హబ్ ఉపయోగపడుతుంది.

దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాము.

43 కొత్త పీహెచ్సి భవనాలను 67 కోట్లతో, 43 కోట్లతో పిహెచ్సి లకు మరమ్మతులు చేస్తున్నాం.

ఏఎన్ఎమ్ (ANM) సబ్ సెంటర్లలకు 1239 ప్రాంతాల్లో 240 కోట్లు కేటాయింపు చేశాం.

మునుగోడు ఉప ఎన్నికల వల్ల డాక్టర్ల భర్తీ ఆలస్యం అయ్యింది. ఈసీ అనుమతి ఇవ్వలేదు.

వారం రోజుల్లో 969 పిహెచ్సి డాక్టర్ల సర్టిఫికెట్లు వెరిఫై చేసి తొందరలోనే నియామక పత్రాలు అందజేస్తాం.

4500 పల్లె దవాఖానలో 2900 ఏఎన్ఎమ్ సబ్ సెంటర్లుగా మార్చుతున్నాం.

3800 గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారు.

1569 పల్లె దవాఖానల్లో పోస్టుల భర్తీ ఎన్నికల వల్ల ఆలస్యం అయ్యింది.

బస్తీ దవాఖానలను 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది.

331 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయి. 2 కోట్ల 11లక్షల 20 వేల మంది రోగులకు ఇప్పటి వరకు వైద్యం అందించాము.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...