తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ

-

తెలంగాణ మహిళలకు మరో గుడ్‌ న్యూస్‌ అందించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా(Arogya Mahila) కేంద్రాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. తాజాగా మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి వీటిని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

ఆరోగ్య మహిళా కేంద్రాల్లో(Arogya Mahila) సంతాన సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తారు. ప్రత్యే కంగా టెస్టులు చేయడం, అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించడం వంటి సేవలు అందిస్తారు. అలాగే.. సుఖ వ్యాధులపై కూడా మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి వైద్య చికిత్సలు కూడా చేస్తారు. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి వాటిపైనా అవగాహన కలిగిస్తారు. మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతో పాటు కౌన్సిలింగ్‌ కూడా ఇస్తారు.

ప్రతి మంగళవారం ఈ ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది మాత్రమే ఉంటారు. వీటి ద్వారా ఆడవాళ్లకు 8 రకాల ప్రధాన వ్యాధులకు సంబంధించి చికిత్స అందిస్తారు. మహిళలకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి పరీక్షలతో పాటు థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ వంటి పెద్ద పెద్ద పరీక్షలు ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారు. అయోడిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం వంటి వాటిని గుర్తించి తగిన మందులు అందజేస్తారు. అలాగే విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు కూడా నిర్వహిస్తారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు సంబంధిచిన టెస్టులు, చికిత్స కూడా అందుబాటులో ఉంటుంది. నెలసరి సమస్యలపైనా వైద్యం అందిస్తారు.

Read Also: హోంగార్డు రవీందర్ మృతి.. ఆసుపత్రి వద్ద భార్య ఆందోళన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...