రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు(Asha Workers) తెలంగాణలోనే ఉన్నారని అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 15 వేల మంది ఆశావర్కర్లకు హరీశ్ రావు నియామక పత్రాలు అందేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లే వాళ్లమని.. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్(Harish Rao) చెప్పారు. కేసీఆర్ కిట్‌తో మాతా శిశు మరణాలను తగ్గించామని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.
Harish Rao | తెలంగాణ ఇప్పుడా పరిస్థితి లేదు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
-
Read more RELATEDRecommended to you
Harish Rao | రోడ్డుపై కుటుంబ సర్వే దరఖాస్తులు.. మండిపడ్డ హరీష్ రావు
Harish Rao | సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం...
Mahesh Kumar Goud | ‘అదానీ అరెస్ట్ అయితే.. మోదీ రాజీనామా తప్పదు’
అదానీ అరెస్ట్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar...
KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’
అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...
Latest news
Must read