తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఆరిజెన్ ఫార్మా(Aurigene Pharma) సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఈ ఫార్మా సంస్థ జీనోమ్ వ్యాలీలో 40 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 250 మందికి పైగా ఉపాధి కల్పించనుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆరిజెన్ ఫార్మా సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఆరిజెన్ ఫార్మా సంస్థ నిర్ణయంపై మంత్రి కేటీఆర్(Minister KTR) హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -
Read Also:
1. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ఔట్.. ఈటలకు కీలక పదవి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat