KTR | ‘ఆటో వాళ్ల సత్తా నాకు తెలుసు’.. మహాధర్నాలో కేటీఆర్

-

ఇందిరా పార్క్ దగ్గర ఆటో డ్రైవర్లు నిర్వహించిన మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్(KTR) కూడా పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం పథకం వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని వారు తమ గోడు చెప్పుకున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 2 లక్షల మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా కూడా మహాలక్ష్మీ పథకం అమలు కాకముందు సగటున రూ.1000 సంపాదించేవారు. ఇప్పుడు వారికి రూ.500 కూడా రావడం లేదని వారు వివరించారు. వారి సమస్యలు విన్న ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు తమ ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు ఇస్తుందని హామీ ఇచ్చింది. కానీ అది పేపర్లకే పరిమితం కావడంతో ఇప్పుడు ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఆటో డ్రైవర్లకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటంలో బీఆర్ఎస్ కూడా భాగమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగులకు తమ మద్దతు, అండ తప్పకుండా ఉంటాయని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

‘‘నేను ఇక్కడికి ఆటోలోనే వచ్చాను. తమ జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోజూ రెండు పూటలా తినాలంటే మూడు పూటలా శ్రమించాల్సి వస్తున్న పరిస్థితులను నాకు ఆటో డ్రైవర్ వివరించారు. రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల(Auto Drivers) పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ.. హైదరాబాద్‌కు వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇదే రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆటోలో ప్రజల దగ్గరకు వచ్చి ఎన్నో కబుర్లు చెప్పారు. మరెన్నో హామీలు ఇచ్చారు. కానీ వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇంటింటికి సంక్షేమం అన్నారు, అత్తలకు, కోడళ్లకు పైసలన్నారు. కానీ ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం కాన్నా సంక్షోభాన్ని ఎక్కువగా తెలస్తోంది’’ అని మండిపడ్డారు. అంతేకాకుండా తాము మహాలక్ష్మీ పథకానికి వ్యతిరేకం కాదని, కాకపోతే రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మొదలయ్యాయని, వాటిని నియంత్రించేలా వారి సమస్యలకు పరిష్కారం చూపాలనే తాము డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు.

Read Also: ఆటో డ్రైవర్లకు కేటీఆర్ మద్దతు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...