Babu Mohan | టీబీజేపీకి మాజీ మంత్రి బాబుమోహన్ రాజీనామా

-

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి బాబుమోహన్ (Babu Mohan) పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొంతమంది నేతలు తనను పొమ్మనకుండా పొగపెడుతున్నారంటూ వాపోయారు. బీజేపీ కోసం చాలా కష్టపడ్డానని.. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేశానని తెలిపారు.

- Advertisement -

గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి తనను దూరం పెడుతూ వస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఆశించానని.. కానీ సీటు దొరికే పరిస్థితి కనపడటం లేదన్నారు. తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.

కాగా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబుమోహన్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు ఉదయ్ మోహన్‌కు టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకుంది. అయితే తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ బాబుమోహన్(Babu Mohan) మండిపడ్డారు. దీంతో ఆయనకే టికెట్ కేటాయించారు.

Read Also: ‘జాక్‌’గా వస్తోన్న సిద్ధు జొన్నలగడ్డ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...