Bnadi sanjay :బీజేపీ లీడ్‌ వచ్చినా.. ప్రకటించటం లేదు

-

Bnadi sanjay fires on CEO in munugode Bypoll conuting:మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ లీడ్‌ వచ్చినప్పటికీ.. ఫలితాలను వెల్లడించటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరి అనుమానాస్పదంగా ఉందని బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ లీడ్‌ వస్తే తప్ప.. సీఈవో రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయటం లేదని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో గతంలో ఎన్నడూ జరగని విధంగా.. ఇప్పుడే ఎందుకు ఆలస్యం అవుతోందని నిలదీశారు. మీడియా నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన తరువాతే.. రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడిస్తున్నారని.. లేకపోతే ఎందుకు ఫలితాలను ప్రకటించటం లేదని ప్రశ్నించారు. మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్‌ చేసేందుకు ఎందుకు లేట్‌ అయ్యిందో సీఈవో చెప్పాలని  బండి సంజయ్‌ (Bandi sanjay) డిమాండ్‌ చేశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు. కాగా, మంత్రి జగదీష్‌ సైతం ఇదే విధంగా సీఈవోను హెచ్చరించిన విషయం తెలిసిందే.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...