కమెడియన్ నుంచి ప్రముఖ నిర్మాతగా మారిన బండ్ల గణేశ్(Bandla Ganesh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికి ఆయన గురించి తెలుసు. బడా సినిమాలు నిర్మిస్తూనే 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హస్తం పార్టీలో చేరిన ఆయన కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటా అనే డైలాగుతో చాలా పాపులర్ అయ్యారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ సడెన్ గా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంచలన ట్వీట్ చేశారు.
‘నీతిగా నిజీయితీగా నిబద్దతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి భాయ్ భాయ్.. నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై. రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజీకీయాలంటే కష్టం రాజీకీయాలంటే పౌరుషం రాజీకీయాలంటే శ్రమ రాజీకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా.. త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం’ అని ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే ఏ పార్టీలో చేరుతారనేది క్లారిటీ ఇవ్వలేదు. తాను ఎంతగానో అభిమానించే పవన్ కల్యాణ్(Pawan Kalyan) పెట్టిన జనసేనలో చేరతారో లేక మరేదైనా పార్టీలో బండ్ల గణేశ్(Bandla Ganesh) జాయిన్ అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.
రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా?????
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
Read Also: పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter