బతుకమ్మ(Bathukamma) అంటేనే పూలను పూజించే పండుగ. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగను అడబిడ్డలంతా ఒక్క చోట చేరి తీరొక్క పూలను సేకరించి ఆడుతుంటారు. అలాంటి పండుగను తెలంగాణలోని ప్రతి ఊరు, వాడలలో ఘనంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద అందరూ కలిసి బతుకమ్మలతో చేసే సందడి చూడడానికి రెండు కళ్లు సరిపోవు. ఇక అమావాస్య రోజు జరిపే ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ వైభవం మొదలు అవుతుంది. ఎంగిలిపూల పండుగను పెత్రామాస కూడా అని అంటారు. ఈరోజు మహిళలు బతుకమ్మను పేర్చి అంతా ఒకే దగ్గర చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు.
ఈ బతుకమ్మ పండుగ అమవాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. తొమ్మిది రోజులు తెలంగాణ ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ , మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరువుతారు. ఇక తెలంగాణలోని ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగ పాటలతో కాలనీలు హోరెత్తుతున్నాయి.
ఇక హైదరాబాద్ నగరంలో హస్తినాపురం – విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీలో అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ(Bathukamma) పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలంతా పూలతో బతుకమ్మలను తయారు చెసారు. బతుకమ్మ పండుగలో పాల్గొని ఎంగిలి పూల బతుకమ్మ రోజు గ్రాండ్ గా దాండియా ఆడుతూ అదేవిధంగా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించి కాలనీ అసోసియేషన్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.