ఆ పిచ్చితోనే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

సంగారెడ్డి తూర్పు ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన మనసులో ఎన్నో విషయాలు మెదులుతున్నాయని, చెప్తే ఏం అవుతుందో.. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలియక ఆగిపోతున్నట్లు తెలిపారు. కానీ, ఒక చిన్న మాట తప్పని పరిస్థితులో మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘నేను రోజు గాంధీభవన్‌లో కూర్చొని ఆనందించేవాడిని. అలాంటిది ఐదు నెలల నుండి గాంధీభవన్‌కి రాలేని పరిస్థితి. నేను గాంధీభవన్‌లో కూర్చొని నాకున్న అనేక సమస్యలు మర్చిపోయేవాడిని. కానీ, ఈరోజు గాంధీభవన్‌కి వచ్చి ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి కరువైపోయింది. ఇది చాలా బాధగా ఉంది నాకు. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబామంటే నాకు చాలా ఇష్టం. ఆ పిచ్చితోనే కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నా. కానీ, ఈరోజు గాంధీభవన్‌లో ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి నాకు కరువైపోయింది.’’ అని మీడియాతో జగ్గారెడ్డి(Jagga Reddy) ఆవేదన చెందారు.

- Advertisement -
Read Also: రైఫిల్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...