‘కల్లలైన నిరుద్యోగుల కలలు’

-

Telangana Job Calendar | నిరుద్యోగుల విషయంలో కూడా బీఆర్ఎస్ బాధ్యత మరిచి ప్రవర్తించిందని మంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణిని అవలంభించిందని, వారి బాధ్యతారాహిత్యం, అలసత్వం వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్చలు చేపట్టామని, డీఎస్సీని ప్రకటించామని గుర్తు చేశారు. ఆఖరికి పేపర్ లీకేజీలు, అసమర్థ పరీక్ష నిర్వహణ వల్ల అర్హులైన అభ్యర్థులను కూడా మానసిక వ్యధకు గురి చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్‌ది అంటూ ఎద్దేవా చేశారు.

- Advertisement -

‘‘గత దశాబ్ద కాలంలో నియామకాల విషయానికి వస్తే రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కలలు కల్లలై పోయాయి. కొత్త ఉద్యోగాలను సృష్టించడం అనే మాట అటుంచితే, ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియలలో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయి. తాము చేపట్టిన అరకొర ఉద్యోగాల నియామక ప్రక్రియలలో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్థ పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి దాపురించింది.

Telangana Job Calendar | ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయడానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది. TGPSC సంస్థను సమూలంగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులను మురియు మౌలిక వసతులను సమకూర్చాము. పోలీసు, వైద్య మరియు ఇతర రంగాలలో ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందచేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఇదివరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది నియామక ప్రణాళిక క్యాలెండర్ ను త్వరలోనే ప్రకటిస్తున్నాం’’ అని వెల్లడించారు భట్టి విక్రమార్క.

Read Also: ‘మా రుణాల కన్నా బీఆర్ఎస్ వడ్డీలే ఎక్కువ’
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...