బీఆర్ఎస్(BRS) అంటేనే మోసమని శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మండిపడ్డారు. చెప్పడానికి వంద మాటలు చెప్తుందికానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చదని విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో బీఆర్ఎస్ ఎన్ని నెరవేర్చిందన్నారు. ఆఖరికి ప్రతి ఏడాదీ పెట్టే బడ్జెట్‌లో కూడా నిధులంటూ అంకెలు చూపడమే తప్పా.. వాటిని ఖర్చు చేసింది లేదన్నారు. ఒక్కటంటే ఒక్క ఏడాది కూడా చెప్పిన అన్ని నిధులను బీఆర్ఎస్ ఖర్చు చేయలేదని వ్యాఖ్యానించారు.
‘‘గత ప్రభుత్వం ఎప్పుడూ నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. బడ్జెట్ భారీగా పెట్టినా నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. 2016-17లో రూ.8వేల కోట్లు, 2018-19లో రూ.40వేల కోట్లు, 2021-22లో రూ.48 వేల కోట్లు, 2022-23లో రూ.52 వేల కోట్లు, 2023-24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదు. ఓఆర్ఆర్‌ను 30 ఏళ్లకు రూ.7వేల కోట్లకు అమ్ముకున్నారు. దొడ్డిదారిన ప్రభుత్వభూములను అమ్ముకున్నారు. కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు’’ అని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మండిపడ్డారు.