Telangana Assembly | బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయ వృద్ధి తిరోగమనంలో పడిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘‘2023-24 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం అభివృద్ధి చెందింది. ఇదే కాలానికి భారత దేశ ఆర్థిక రంగం 7.6 శాతం, తెలంగాణ 7.4 శాతంగా వృద్ధిని నమోదు చేసాయి. అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధిరేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి’’ అని చెప్పారు.
‘‘2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర, దేశీయ ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే 14,63,963 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9 శాతం వృద్ధి రేటు నమోదయింది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1 శాతం ఉంది.
Telangana Assembly | ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు, పెరిగిన రుణం వల్ల, ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమౌతుంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతుందంటే – కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది. దానిని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని, ఆదాయాన్ని సమన్వయ పరిచే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది’’ అని వెల్లడించారు.