బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఆయనకు స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండ్‌కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా తోటీ ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్‌కు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. పట్నం నరేందర్‌కు ఇంటి భోజనం పొందడానికి అనుమతించింది న్యాయస్థానం. అయితే ఇటీవల పట్నం నరేందర్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో పట్నంకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించినట్లు ఖరారైంది.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం.. లగచర్ల(Lagacherla), పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వ కసరత్తులు చేపట్టింది. ఇందులో భూసేకరణపై ప్రజాభిప్రాయం సేకరించడం కోసం లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prateek Jain) సహా పలువురు అధికారులు వెళ్లారు. వారిపై స్థానికులు, గ్రామస్తులు అంతా కలిసి కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కలెక్టర్‌పై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని గుర్తించారు. అతడు నిందితుడు పట్నం నరేందర్(Patnam Narender Reddy) ప్రధాన అనుచరుడు సురేష్ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించే పట్నం నరేందర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.