బిగ్‌బాస్(Bigg Boss 7) విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth)ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అయిపోగానే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రశాంత్ ఫ్యాన్స్ ఆర్టీసీ బస్బులతో పాటు కంటెంస్ట్‌లు కారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌పై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అతడి తమ్ముడిని అరెస్ట్ చేయగా.. ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. తాజాగా ప్రశాంత్‌ను తన ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు ఈ తతంగంలో బిగ్‌బాస్ హోస్ట్ సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna)ను అరెస్ట్ చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. షో ముగిసిన తర్వాత ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేయడానికి నాగార్జునను బాధ్యులు చేయాలని న్యాయవాది అరుణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వెనకున్న కుట్రను బయటకు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తానికి రైతుబిడ్డ ముసుగు వేసుకుని ఓవరాక్షన్ చేసిన ప్రశాంత్(Pallavi Prashanth) కారణంగా నాగార్జున కూడా చిక్కుల్లో పడ్డారు.
బిగ్ న్యూస్::
బిగ్ బాస్ ఫేమ్ #పల్లవిప్రశాంత్ అరెస్ట్
గజ్వేల్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు #BiggBossTelugu7 #PallaviPrasanth pic.twitter.com/dy2wTNrToA— Sravani Journalist (@sravanijourno) December 20, 2023