Delimitation | అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ మరోసారి డుమ్మా

-

కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రణాళికలపై దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలని కేంద్రం కుట్రలు పన్నుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ నెల 22న చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రతి పార్టీ నేతలతో జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) సమావేశం నిర్వహించాలని తమిళనాడు సీఎం డీఎంకే నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ సహా, బీఆర్ఎస్ నేతలకు డీఎంకే నేతలు కలిసి ఆహ్వానించారు. కాగా జేఏసీ సమావేశానికన్నా ముందే తెలంగాణలో డీలిమిటేషన్‌పై చర్చించడానికి అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు రేవంత్ తెలిపారు.

- Advertisement -

కాగా సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజుకావాలని అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సమావేశానికి కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, రిపబ్లిక్ కన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టాయి. ఈ నెలలో జరిగిన రెండు అఖిలపక్ష సమావేశాలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఈ సమావేశానికి బీ ఆర్ఎస్ నేతలను సైతం ఆహ్వానించినప్పటికీ వారు ప్రత్యేక రాజకీయ కారణాల తో సమావేశానికి హాజరు కాలేమని తెలిపారని డిప్యూటీ సీఎం వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంటు సమావేశంలో బిజీగా ఉండడం, ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు హాజరు కాలేదని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశానికి హాజరైన నేతలంతా ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్తులో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో ప్రణాళిక తయారు చేసుకొనే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Criminal Cases | క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలో ఏపీ, తెలంగాణ టాప్

క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్న ఎక్కువమంది ఎమ్మెల్యేల లిస్టులో తెలుగు రాష్ట్రాలు...