Mungode bypoll: మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పై దాడి జరిగింది. బీజేపీ శ్రేణులే తమ కాన్వాయ్ వాహనంపై దాడికి దిగారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. ప్రచారానికి వెళ్తున్న తమ వాహనాని దారి ఇవ్వకుండా.. బీజేపీ నేతలు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాన్వాయ్ వాహనానికి అడ్డుపడుతున్న బీజేపీ వాహనాన్ని నాంపల్లికి సమీపంలో తమ కార్యకర్తలు నిలిపివేసినట్లు స్రవంతి వివరించారు.
తమ కాన్వాయ్ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా, కాంగ్రెస్ శ్రేణులను అసభ్యకరంగా దూషించటమే కాక, దాడి చేశారని స్రవంతి ఆరోపించారు. దాడి చేసిన వారు ముమ్మాటికీ బీజేపీకు చెందిన వారేనని పాల్వాయి స్రవంతి ఘంటాపథంగా చెప్తున్నారు. కానీ దాడికి దిగిన వారు స్థానిక బీజేపీ కార్యకర్తలు కాదని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన విషయాన్ని జిల్లా ఎస్పీకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు దాడి సమయంలో తీసిని వీడియోలను సైతం ఎస్పీకు పంపించినట్లు వివరించారు. ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగుతున్నారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు.
Read also: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు