తెలంగాణ(Telangana)లో బీజేపీ హై కమాండ్ మరింత దూకుడుగా రాజకీయ కార్యాచరణ నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకునేందుకు వివిధ కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వచ్చే రెండు నెలలపాటు రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండనున్నాయి. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీ ఎత్తున సభలు నిర్వహించనున్నారు కొన్ని సభల్లో అమిత్ షా(Amit Shah), మరికొన్ని సభల్లో జేపీ నడ్డా(JP Nadda) పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి(Premender Reddy) వెల్లడించారు.
- Advertisement -
Read Also: వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లు
Follow us on: Google News, Koo, Twitter