Khammam | తెలుగు రాష్ట్రాల నాయకత్వంలో బీజేపీ అధిష్టానం పెను మార్పులు చేసింది. తెలంగాణ బిజెపి చీఫ్ గా బండి సంజయ్ ని మారుస్తూ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు ఢిల్లీ పెద్దలు. సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరిని నియమించింది. బిజెపి హై కమాండ్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల బిజెపి వర్గాల్లో కలవరం రేగింది.
ఈ క్రమంలో ఖమ్మం(Khammam) టౌన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్(Gajjala Srinivas) తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి చీఫ్ గా బండి సంజయ్ రాజీనామా చేయడం తనను బాధించిందని.. ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం సాయంత్రం ఖమ్మంలోని దానవాయిగూడెం కాలనీలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఓ సూసైడ్ లెటర్ కూడా రాసినట్లు సమాచారం. “బండి సంజయ్‌ను బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. సంజయ్ అన్న అంటే నాకు చాలా అభిమానం. నాకు ఎవరిపైనా పగ లేదు” అని సదరు లేఖలో పేర్కొన్నారు గజ్జల శ్రీనివాస్.
Read Also:
1. ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. స్త్రీలకు ఆ సమస్యలు!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat