DK Aruna: న్యూడ్‌ కాల్స్‌లో సూత్రధారులు టీఆర్‌ఎస్‌ నాయకులే

-

Bjp leader DK Aruna comments on Nude video calls case: న్యూడ్‌ కాల్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వరకు.. పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహించారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గద్వాల్‌ కీర్తిని టీఆర్‌ఎస్‌ అభాసుపాలు చేసిందంటూ ధ్వజమెత్తారు. న్యూడ్‌ కాల్స్‌లో సూత్రధారులు, పాత్రధారులు టీఆర్‌ఎస్‌ నాయకులేనని ఆరోపించారు. ప్రతి మహిళ భయపడే విధంగా, స్త్రీల గౌరవాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు బజారున పడేశారంటూ దుయ్యబట్టారు. న్యూడ్‌ కాల్స్‌ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టకూడదని డిమాండ్‌ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని డీకే అరుణ కోరారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...