NVS Prabhakar | మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతో BRS గట్టెక్కింది

-

NVS Prabhakar | తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశ్వనగరంలో కుక్కల దాడిలో ఎంతోమంది చనిపోతున్నారని, నైతిక బాధ్యత వహించి కేటీఆర్(KTR) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేటీఆర్‌ను అసమర్థ మంత్రిగా గుర్తించి సీఎం కేసీఆర్ అయినా తొలగించాలని కోరారు. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతో బీఆర్ఎస్(BRS) గట్టెక్కిందన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా గెలిచే చాన్స్ ఉన్నా మజ్లిస్‌కు మద్దతు ప్రకటించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ అసెంబ్లీ వేదికగా చెప్పారని, ఇదంతా బీఆర్ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకేనని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVS Prabhakar) ఆరోపించారు. రాబోయే ఎన్నికలు కేసీఆర్ ఆశలు ఆవిరి కావడం ఖాయమని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...