రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ సర్కా్ర్‌లపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, ఆప్, కాంగ్రెస్‌ల మధ్య బంధం ఉందని అన్నారు. కాంగ్రెస్(INC), బీఆర్ఎస్(BRS) ఒక్కటే అని విమర్శించారు. ఆప్(AAP) అవినీతి, కుంభకోణాల్లో మునిగిపోయిందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ కాపాడలేదని అన్నారు. ఆగష్టు 9వ తేదీన మరో క్విట్ ఇండియా ఉద్యమం జరుగబోతోందని వెల్లడించారు. ఇండియా కూటమి(INDIA Alliance)లోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను చూడలేక ప్రతిషక్షాలు అవిశ్వాస తీర్మాణం పెట్టాయని అన్నారు.