Graduates MLC Election | కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ వీడింది. హోరాహోరీగా సాగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియలో విజయం అభ్యర్థులతో దోబూచులాడింది. 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయను మొత్తం 78,635 ఓట్లు రాగా.. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. దీంతో అంజిరెడ్డిని విజేతగా ప్రకటించారు.
రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో బీఎస్‌పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయ్యారు. అప్పటికీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. కాగా, కోటా నిండకుండా ఫలితం ప్రకటించవద్దని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి.. కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. దీనిపై అధికారులతో కలెక్టర్ సంప్రదింపులు జరిపారు. నరేందర్ రెడ్డి అభ్యంతరాలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆయనకు వివరణ ఇచ్చారు. దీంతో నరేందర్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు.
Graduates MLC Election ఓట్ల లెక్కలు ఇలా ఉన్నాయి..
పోలైన మొత్తం ఓట్లు : 252,029
చెల్లిన ఓట్లు : 223,343
చెల్లని ఓట్లు : 28,686
కోటా నిర్ధారణ ఓట్లు : 111,672
ముగ్గురు ప్రధాన పోటీదారులకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు
1. అంజిరెడ్డి : 75,675
2. నరేందర్ రెడ్డి : 70,565
3. ప్రసన్న హరికృష్ణ : 60,419
పోటీలో ఉన్న మిగతా పోటీదారులు 53 మంది అందరికీ కలిపి వచ్చిన ఓట్లు : 16,784
గెలుపు కోటాను చేరాలంటే కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు
అంజిరెడ్డి : 35,997
నరేందర్ రెడ్డి : 41,107
ప్రసన్న హరికృష్ణ : 51,253