హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్(Nikhat Zareen)ను డీఎస్‌పీ పదవితో సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం. డీజీపీ ఆమెకు జానింగ్ ఆర్డర్స్‌ను మంగళవారం అందించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆమె డీఎస్‌పీగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో నిఖత్ ప్రతిభను గుర్తిస్తూ ఆమెకు డీఎస్‌పీగా పోస్ట్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఆమెకు డీఎస్‌పీ పదవిని కేటాయించారు. స్పెషల్ పోలీస్ విభాగంగా ఆమెకు ఈ పదవిని అందించారు. ఈ మేరకు విషయాన్ని తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈరోజు ఆమె విధుల్లో చేరారు.
అయితే నిఖత్ జరీన్ ఇప్పటి వరకు రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. అంటాల్యలో 2011లో జరిగిన ఏఐబీఏ మహిళల యూత్, జూనియర్ బాక్సింట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పథకం సాధించారు. 2022 ఇస్తాంబుల్, 2023 న్యూఢిల్లీ ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పసిడి పతకాన్ని పట్టేశారు. 2022 బర్మింగ్‌హాట్ కామన్ వెల్గ్ గేమ్స్‌లో కూడా స్వర్ణం సాధించారు. 2022 ఆసియా క్రీడల్లో లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో కాంస్యపథకం గెలుచుకున్నారా నిఖత్ జరీన్(Nikhat Zareen).