తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ(BR Ambedkar University) పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల పరిధిలోని అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పరీక్షల కొత్త తేదీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు జేఎన్‌టీయూ పరిధిలోని పరీక్షలు నేడు యధావిధిగా జరుగుతున్నాయి.