ప్రేమించిన వారితో పెళ్లికి ఒప్పుకోలేదని అన్నా, చెల్లెలు ఆత్మహత్య

-

Sircilla |ఒక కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెలు మరో కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెళ్లను ప్రేమించారు.. మూడు నెలల వ్యవధిలో ఒక కుటుంబానికి చెందిన అన్న చెల్లెలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల – వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన పాలకుర్తి లింగయ్య, పద్మ దంపతులకు కొడుకు ప్రశాంత్(22), కూతురు నవ్య ఉన్నారు.

- Advertisement -

నవ్యకు ఆరు నెలల కింద ఓ యువకుడితో పెళ్లి అయ్యింది. అతడు పెళ్లి అనంతరం గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు.. అప్పుడు నవ్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఐదేండ్ల నుంచి ప్రేమలో ఉన్న విషయం తల్లితండ్రులకు చెప్పి.. సదరు యువకుడితో పెండ్లి చేయాలని కోరింది. వారు ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.

sircilla | కాగా నవ్య ప్రేమించిన యువకుడి చెల్లెలు నవ్య సోదరుడైన ప్రశాంత్ కూడా ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీని గురించి పెద్దలకు చెప్తే ఒప్పుకోలేదు. దీంతో ప్రశాంత్ కూడా పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.

Read Also: బీఆర్ఎస్ కి ‘హ్యాండ్’ ఇచ్చిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...