KCR | ఆసుపత్రి పాలైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఆసుపత్రి పాలయ్యారు. గురువారం అర్ధరాత్రి ఆయన కాలికి గాయం అవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బాత్రూంలో కాలుజారి పడిపోవడంతో గాయమైంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఎడమ కాలి తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కేసీఆర్ ఆసుపత్రి పాలవడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కేసీఆర్(KCR) ఎర్రవల్లి(Erravalli)లోని తన ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయారు. డిసెంబర్ 3 నుండి ఆయన ఫామ్ హౌస్ లోనే నివాసం ఉంటున్నారు. ఆయనను కలిసేందుకు BRS ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రతిరోజూ ఫామ్ హౌస్ కి వెళుతున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ కి గాయం అవడం వారందరినీ కలచివేస్తోంది.

Read Also: తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....