మహారాష్ట్రలో నిర్వహించిన బీఆర్ఎస్ శిక్షణ తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు అని స్పష్టం చేశారు. దేశంలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించామని వెల్లడించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక(Karnataka) ఫలితాలను చూసి కొంతమంది నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ అమలు కావాలని ఆకాంక్షించారు. దేశంలో నీరు పుష్కలంగా ఉందని అయినా వాడుకోలేకపోతున్నామని.. భూమి ఉన్న వినియోగించుకోలేకపోతున్నామని అన్నారు. సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని కేసీఆర్(KCR) ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: ముఖ్యమంత్రి కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
Follow us on: Google News, Koo, Twitter