మాజీ సీఎం కేసీఆర్(KCR).. శుక్రవారం పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల(Silver Jubilee Celebrations) సుదీర్ఘంగా చర్చించారు. ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో జరిగింది. ఇందులో పార్టీ నేతలకు కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీని మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసుల విషయంలో పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.