KCR | ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం కేసీఆర్

-

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR).. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. స్పీకర్‌ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్‌ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యనేతలందరూ కేసీఆర్ వెంట ఉన్నారు. ముఖ్యమంత్రిగా గత పదేళ్లలో అసెంబ్లీ గేట్ నెంబర్ 1 ద్వారా రాకపోకలు సాగించిన కేసీఆర్.. ఇవాళ మాత్రం గేట్ నెంబర్ 2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

- Advertisement -

కాగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్(KCR) ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జారి పడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేయడంతో అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకాలేకపోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్.. తాజాగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు.

Read Also: ప్రతి ఒక్కరికీ ఇళ్లు.. ఉచిత విద్యుత్.. బడ్జెట్‌లో కీలక హామీలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...