తాము కేసీఆర్ వెంటే ఉంటామని.. పార్టీ మారే ప్రసక్తే లేదని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy), కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy), గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy), మాణిక్ రావు(Manik Rao) స్పష్టంచేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం చర్చించేందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని క్లారిటీ ఇచ్చారు. అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఎప్పటికీ తమ నాయకుడని.. ఆయన నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని వెల్లడించారు.
BRS MLAs | రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికే ముఖ్యమంత్రి కాదని.. రాష్ట్రం మొత్తానికి సీఎం అని తెలిపారు. శాసనసభ్యులుగా తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ ఎలా అయితే కలుస్తున్నారో.. తాము అలాగే సీఎంను కలుస్తామని వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని.. తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
మాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే కలిశాం : ఎమ్మెల్యే శ్రీ @KPRTRS pic.twitter.com/7g0lJ7UQEt
— BRS Party (@BRSparty) January 24, 2024