సొంత పార్టీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ కలుపుకుని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని చెబితే.. స్థానిక నాయకత్వం తనను విస్మరించిందని ఆరోపించారు. జిల్లాలో జరిగిన ఒక్క ఆత్మీయ సమ్మేళనానికి కూడా తనను ఆహ్వానించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు తనకు ఆహ్వానం లేదని కడియం ఆరోపించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం తాను ఎంతో శ్రమించానని, అయినా తనపట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సహకరించానన్నారు.
Read Also: అధ్యయనం: తిన్న తర్వాత 2 నిమిషాల నడక అలాంటివారికి వరమట
Follow us on: Google News, Koo, Twitter