MLC Kavitha | కవితకు భారీ షాక్.. వారం రోజుల రిమాండ్

-

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా వారం రోజులు ఇచ్చేందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు. మార్చి 23 మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ఏడు రోజుల పాటు ఈడీ హెడ్ క్వార్టర్స్‌లోనే కవితను విచారణ చేయనున్నారు అధికారులు. కస్టడీ సమయంలో కవితకు ఇంటి నుంచి బట్టలు, భోజనం అందించేలా కోర్టు ఆదేశించింది. అలాగే ఆమెను కలిసేందుకు కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులకు కూడా అనుమతించింది.

- Advertisement -

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటతున్న కవితను శుక్రవారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే ఢిల్లీకి తరలించిచారు. ఇవాళ వైద్య పరీక్షల తర్వాత రౌస్ ఎవెన్యూ సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ తరఫున ఎన్‌.కె మట్టా, జోయబ్‌ హుసేన్‌ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వారం రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...