తెలంగాణ అవతల బీఆర్ఎస్ తొలి విజయం.. మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బోణీ

-

జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి(BRS Maharashtra) తొలి విజయం లభించింది. మహారాష్ట్రలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ గెలుపొందారు. ఆ రాష్ట్రంలో సత్తా చాటాలని భావిస్తున్న అధినేత కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే గురువారం జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS Maharashtra) అభ్యర్థిని బరిలో దింపారు. ఆయన విజయం కోసం కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. దీంతో గఫూర్ 115 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో జాతీయ రాజకీయాల్లో తొలి విజయం అందుకుంది బీఆర్ఎస్. మరోవైపు రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యదర్శులకు రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరం కార్యక్రమం నాందేడ్‌(Nanded)లో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్(KCR) అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -
Read Also: నా తండ్రి చెప్పిన ఆ మూడు సూత్రాలను ఇప్పటికీ పాటిస్తున్నా: మంత్రి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...