BRS Protest |మంత్రి కేటీఆర్(KTR) పిలుపు మేరకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్(BRS) పార్టీ ఆందోళనలు చేపట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో కార్యకర్తలు గురువారం భారీ సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంపై నిరసిస్తూ కట్టెల పొయ్యిలపై రోడ్లమీద మంత్రులు, ఎమ్మెల్యేలు వంటావార్పు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 2014లో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 1200కు పెంచి.. ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Protest |కట్టెల పొయ్యిలతో నడిరోడ్డుమీద మంత్రులు, ఎమ్మెల్యేల నిరసన
-