ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు. విభజన హామీలను ప్రధాని మోడీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. గుజరాత్‌కు రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
రేపటి మోడీ పర్యటన(PM Modi Tour)ను తామంతా బహిష్కరిస్తున్నామని చెప్పారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. నిత్యం కేసీఆర్ సర్కార్‌ను విమర్శించే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ప్రధానిని, బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడని ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో గాడ్సే దూరాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి అని ఆరోపించారు. భూ దందాలు చేసే వ్యక్తులే ధరణి(Dharani Portal)ని వద్దంటున్నారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయన్నారు. ఆ పార్టీల మోసాలు ప్రజలకు తెలుసని వెల్లడించారు. సీఎం కేసీఆర్ పోరాటాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్(KTR) స్పష్టం చేశారు.
Read Also: తెలంగాణ ఇప్పుడా పరిస్థితి లేదు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat