KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’

-

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గుర్రుమన్నారు. అదానీ అవినీపరుడని తెలిసిన వెంటనే కెన్యా వంటి చిన్న దేశామే.. అతనితో చేసుకున్న అన్ని ఒప్పందాలు రద్దు చేసిందని, అటువంటి రేవంత్ మాత్రం అదానీతో చేసుకున్న ఒప్పందాలపై కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘అదానీ విషయంలో కాంగ్రెస్.. ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతుంది. అదానీ అవినీతిపరుడైతే.. రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతోడు? రాహుల్ గాంధీ చెప్పాలి.

- Advertisement -

రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణ సర్కార్ అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి. కెన్యా(Kenya) లాంటి చిన్న దేశాలే రద్దు చేసుకున్నప్పుడు.. రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేసుకోడు? అదానీ(Adani)తో ఒప్పందాలపై పునరాలోచన చేయాలని షర్మిల సైతం అంటున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచన రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీసుకోవాలి’’ అని కేటీఆర్ సూచించారు.

‘‘మహారాష్ట్ర వెళ్ళి అదానీని గజదొంగ అని మాట్లాడిన రేవంత్.. తెలంగాణలో మాత్రం గజ మాల వేస్తున్నారు. అదానీతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలపై తెలంగాణ బీజేపీ వైఖరి చెప్పాలి. అదానీ వ్యవహరంతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైంది. మోదీ, అమిత్ షా, రాహుల్, రేవంత్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదానీతో దేశానికి నష్టమైతే.. తెలంగాణకు నష్టం కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి.

స్కిల్ యూనివర్శిటీకి వంద కోట్లు తీసుకోవడం తప్పా? కాదా?. కోహినూరు హోటల్లో మంత్రి పొంగులేటి, అదానీ రహస్య సమావేశం అయిన మాట వాస్తవం. అదానీతో‌ ఒప్పందాలు రేవంత్ సర్కార్ రద్దు చేసుకోవటం లేదు? అదానీ వేల కోట్లు ఒప్పందాలపై‌.. రోజూ విమర్శించే రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీకి తెలిసే రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల విరాళం తీసుకున్నారా?’’ అని ప్రశ్నించారు కేటీఆర్.

‘‘బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే.. కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీనా? కేసీఆర్(KCR) హాయాంలో ఎంత ప్రయత్నం చేసినా.. తెలంగాణలో అదానీకి అవకాశం ఇవ్వలేదు. అదానీతో మేము ఫోటోస్ దిగిన మాట వాస్తవం. అంతే మర్యాదగా బయటకు పంపించాం. రేవంత్ రెడ్డి మాత్రం అదానీకి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికాడు. అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి. బడేబాయ్ మోదీ ఆదేశాలను.. చోటా బాయ్ రేవంత్ అమలు చేశాడు.

తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటుకు రేవంత్ సహకారం అందిస్తున్నారు. అదానీ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మసకబారింది. అదానీ వ్యవహరంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. రామన్నపేటలో అదానీ సిమెంట్ పరిశ్రమ వద్దని ఆందోళనా చేసినా రేవంత్ పట్టించుకోలేదు’’ అని కేటీఆర్(KTR) గుర్తు చేశారు.

Read Also: హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ చెంప చెళ్లుమందా..!
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...