MP సంతోష్ పై RS Praveen Kumar సీరియస్

-

BSP State Chief RS Praveen kumar fire on MP Santhosh Kumar:బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహుజన రాజ్యాధికార పాదయాత్రలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఎనిమిదేళ్లుగా గుర్తుకు రానీ కొండగట్టు కేసీఆర్ పుట్టినరోజు నాడే ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. కొండగట్టుకు రూ.500 కోట్లు మంజూరు చేసింది కొండగట్టుపై ప్రేమతో కాదని, తన బంధువైన సంతోష్ కుమార్ కోసం అని ఆరోపించారు.

- Advertisement -

దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకం తీసుకురాలేదని, ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తీసుకొచ్చారని న్నారు. దళిత బంధు పథకంలో దళితుల కంటే కంపెనీల యజమానులు, మధ్యవర్తులే ఎక్కువగా లాభం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. దళితులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడి మహేంద్ర షోరూం నుండి మహేంద్ర ట్రాక్టర్ ఇప్పించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ వార్తలు ప్రచురణ చేస్తే ఐటీ దాడులు చేయడమేంటని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే బీఎస్పీ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...